Breaking News

2.7 కిలోల ఓపియం డ్రగ్స్‌ పోలీసుల స్వాధీనం

ఫిబ్రవరి 20, 2026న సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్పరిధిలో ఎస్‌వోటీ (SOT) పోలీసులు భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు


Published on: 20 Feb 2026 10:44  IST

ఫిబ్రవరి 20, 2026న సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్పరిధిలో ఎస్‌వోటీ (SOT) పోలీసులు భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి సుమారు 2.7 కిలోల ఓపియం (Opium) డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ అక్రమ రవాణాకు సంబంధించి పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

డ్రగ్స్ తరలిస్తున్నారనే ముందస్తు సమాచారంతో మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు అమీన్‌పూర్‌లోని ఒక మార్బుల్ షాపుపై దాడి చేసి ఈ డ్రగ్స్‌ను గుర్తించారు.పట్టుబడిన డ్రగ్స్‌ను, నిందితులను తదుపరి విచారణ నిమిత్తం అమీన్‌పూర్ పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో రాజస్థాన్‌కు చెందిన మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం. 

Follow us on , &

ఇవీ చదవండి