Breaking News

విద్యుత్ స్తంభం విరిగిపడి మహిళకు గాయాలు

నిర్మల్ జిల్లా ముథోల్ మండలం చించాల గ్రామంలో20 ఫిబ్రవరి 2026, శుక్రవారం ఉదయం శిథిలావస్థలో ఉన్న విద్యుత్ స్తంభం విరిగిపడి ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.


Published on: 20 Feb 2026 18:49  IST

నిర్మల్ జిల్లా ముథోల్ మండలం చించాల గ్రామంలో20 ఫిబ్రవరి 2026, శుక్రవారం ఉదయం శిథిలావస్థలో ఉన్న విద్యుత్ స్తంభం విరిగిపడి ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. భైంసా మండలం మాగం గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ.లక్ష్మి రెండు రోజుల క్రితం ఒక శుభకార్యం నిమిత్తం చించాల గ్రామానికి వచ్చారు. శుక్రవారం ఉదయం ఆమె ఆరుబయటకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

విద్యుత్ స్తంభం పైకి ఒక కొండముచ్చు ఒక్కసారిగా దూకడంతో, ఇప్పటికే బలహీనంగా ఉన్న ఆ స్తంభం విరిగి ఆమెపై పడింది.తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం ముథోల్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి