Breaking News

తండ్రి పురపాలక చైర్మన్ కొడుకు ట్రాక్టర్ డ్రైవర్

ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో ఒక అరుదైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ మున్సిపాలిటీకి తాజాగా ఎన్నికైన ఛైర్మన్ కుమారుడు అదే మున్సిపాలిటీలో పారిశుద్ధ్య ట్రాక్టర్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

Published on: 23 Feb 2026 15:14  IST

ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో ఒక అరుదైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ మున్సిపాలిటీకి తాజాగా ఎన్నికైన ఛైర్మన్ కుమారుడు అదే మున్సిపాలిటీలో పారిశుద్ధ్య ట్రాక్టర్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 

ధారావత్ మోహన్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున 7వ వార్డు (హనుమ తండా) కౌన్సిలర్‌గా గెలుపొంది, అనంతరం మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.ధారావత్ రఘు తండ్రి అదే మున్సిపాలిటీకి బాస్ (ఛైర్మన్) అయినప్పటికీ, రఘు మాత్రం గతంలో లాగే పారిశుద్ధ్య ట్రాక్టర్ డ్రైవర్‌గా (Sanitation Tractor Driver) తన పనిని కొనసాగిస్తున్నారు.

కల్లూరు మున్సిపాలిటీ, ఖమ్మం జిల్లా, తెలంగాణ తండ్రి ఉన్నత పదవిలో ఉన్నా, కుమారుడు ఏమాత్రం గర్వం లేకుండా కష్టపడి పని చేస్తూ ఉండటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది

Follow us on , &

ఇవీ చదవండి