Breaking News

చౌటుప్పల్ పట్టణంలో ఒక భారీ దొంగతనం

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో ఫిబ్రవరి 22, 2026 (శనివారం) రాత్రి ఒక భారీ దొంగతనం జరిగింది.


Published on: 23 Feb 2026 15:34  IST

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో ఫిబ్రవరి 22, 2026 (శనివారం) రాత్రి ఒక భారీ దొంగతనం జరిగింది.స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన లింగంపల్లి నరసింహ నివాసంలో ఈ చోరీ జరిగింది.శనివారం ఉదయం నరసింహతన భార్యతో కలిసి హైదరాబాద్‌లో చదువుకుంటున్న కుమార్తెను చూసేందుకు వెళ్లారు. వారు ఇంట్లో లేని సమయాన్ని ఆసరాగా చేసుకున్న దుండగులు, ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు.

బీరువాలో దాచి ఉంచిన రూ. 22 లక్షల నగదును గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు.బాధితుడు సోమవారం నాడు ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం తన బంగారాన్ని బ్యాంకులో పెట్టి ఈ నగదును సమకూర్చుకున్నట్లు సమాచారం.రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చిన నరసింహ, తలుపులు తెరిచి ఉండటం చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి