Breaking News

RTCడ్రైవర్ శంకర్ గౌడ్ మరణంపై బండి

వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ మరణంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్తీవ్రంగా స్పందించారు. దీనిని ఆయన "ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే" అని అభివర్ణించారు.


Published on: 24 Apr 2026 15:28  IST

వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ మరణంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరి, నిర్లక్ష్యం కారణంగానే శంకర్ గౌడ్ ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వమే చేసిన హత్య అని బండి సంజయ్ మండిపడ్డారు.ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 100 రోజుల్లో నెరవేరుస్తామని చెప్పి, 900 రోజులు గడుస్తున్నా పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని ఆయన విమర్శించారు.

రాష్ట్రంలోని 39 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు దుర్భర జీవితం గడుపుతున్నారని, ప్రభుత్వం కాలయాపన కోసం కమిటీలు వేస్తూ వారిని మభ్యపెడుతోందని ఆక్షేపించారు.శంకర్ గౌడ్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బండి సంజయ్, శుక్రవారం (ఏప్రిల్ 24) ఆయన అంత్యక్రియలకు హాజరుకానున్నట్లు సమాచారం.శంకర్ గౌడ్ మృతికి నిరసనగా ఆర్టీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. 

 

Follow us on , &

ఇవీ చదవండి