Breaking News

ప్రేమ పేరుతో మోసం యువతి ఆత్మహత్య

వరంగల్‌లో ప్రేమ పేరుతో మోసపోయిన ఒక మైనర్ బాలిక, తన పుట్టినరోజే (జూన్ 13న) మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.


Published on: 16 Jun 2026 17:16  IST

వరంగల్‌లో ప్రేమ పేరుతో మోసపోయిన ఒక మైనర్ బాలిక, తన పుట్టినరోజే (జూన్ 13న) మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

ములుగు రోడ్‌కు చెందిన వలభాను పృథ్వీరాజ్ (31). ఇతనికి 2021లోనే వివాహమై, 4 ఏళ్ల కుమారుడు ఉన్నాడు.పృథ్వీరాజ్ తన పెళ్లి విషయాన్ని దాచిపెట్టి, సదరు బాలికతో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.జూన్ 13న ఆ బాలిక తన 18వ పుట్టినరోజు జరుపుకుంది. అనంతరం కాజీపేటలోని ఒక హోటల్‌లో వారు కలుసుకున్నారు. మైనారిటీ తీరడంతో తనను పెళ్లి చేసుకోవాలని బాలిక కోరగా, పృథ్వీరాజ్ నిరాకరించాడు. తనకు అప్పటికే పెళ్లయిందని నిజం చెప్పి కులాల పట్టింపులను సాకుగా చూపాడు.

మోసపోయానని గ్రహించిన బాలిక తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంటికి వచ్చిన తర్వాత తన సోదరికి జరిగిన విషయాన్ని వివరించి, ఆ రాత్రి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేశారు.

నిందితుడు పృథ్వీరాజ్‌పై భారతీయ న్యాయ సంహిత కింద రేప్, ఆత్మహత్యకు ప్రేరేపించడం, అలాగే పోక్సో చట్టం, SC/ST అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి, అతనిని అదుపులోకి తీసుకున్నారు.వరంగల్ డివిజన్ ఇన్‌ఛార్జ్ ఏసీపీ నర్సింహరావు ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement