Breaking News

గణేష్ నిమజ్జన సందర్భంగా ప్రత్యేక MMTS

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన వేడుకల సందర్భంగా పెరిగే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక ఎమ్‌ఎమ్‌టీఎస్ (MMTS) రైళ్లను నడపాలని నిర్ణయించింది.


Published on: 23 Sep 2026 15:56  IST

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన వేడుకల సందర్భంగా పెరిగే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక ఎమ్‌ఎమ్‌టీఎస్ (MMTS) రైళ్లను నడపాలని నిర్ణయించింది. అయితే, ఈ ప్రత్యేక అర్ధరాత్రి సర్వీసులు సెప్టెంబర్ 23న కాకుండా, ప్రధాన నిమజ్జన రోజులైన సెప్టెంబరు 25-26 మరియు సెప్టెంబరు 26-27 తేదీల మధ్య రాత్రి వేళల్లో అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల సౌకర్యార్థం మొత్తం 8 ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లు రాత్రంతా నడపనున్నారు.

ప్రయాణ సమయాలు ,రూట్లు:

సమయం: నిర్ణీత తేదీలలో రాత్రి 11:00 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 05:00 గంటల వరకు ఈ రైళ్లు తిరుగుతాయి.

ప్రధాన మార్గాలు: సికింద్రాబాద్, హైదరాబాద్ (నాంపల్లి), లింగంపల్లి, ఫలక్‌నుమా వంటి కీలకమైన ప్రాంతాలను కవర్ చేస్తూ ఈ క్రింది రూట్లలో సర్వీసులు నడుస్తాయి:

సికింద్రాబాద్ – హైదరాబాద్

హైదరాబాద్ – లింగంపల్లి

లింగంపల్లి – హైదరాబాద్

హైదరాబాద్ – సికింద్రాబాద్

లింగంపల్లి – ఫలక్‌నుమా

ఫలక్‌నుమా – సికింద్రాబాద్

Follow us on , &

ఇవీ చదవండి