Breaking News

మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్కు సెక్యూరిటీగార్డ్ ముద్దు

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో క్యాబ్ ఎక్కుతున్న 24 ఏళ్ల మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను ఓ సెక్యూరిటీ గార్డు బలవంతంగా పక్కకు లాగి ముద్దు పెట్టుకున్న సంఘటన కలకలం రేపింది.


Published on: 23 Sep 2026 15:39  IST

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో క్యాబ్ ఎక్కుతున్న 24 ఏళ్ల మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను ఓ సెక్యూరిటీ గార్డు బలవంతంగా పక్కకు లాగి ముద్దు పెట్టుకున్న సంఘటన కలకలం రేపింది.

హైదరాబాద్‌, గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లోని ఇందిరానగర్ ప్రాంతంలో ఈ హేయమైన చర్య చోటుచేసుకుంది.విశాఖపట్నం (వైజాగ్) కు చెందిన 24 ఏళ్ల యువతి గచ్చిబౌలి ఇందిరానగర్‌లోని ఓ పీజీ (PG) హాస్టల్‌లో ఉంటూ, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది.

మంగళవారం ఉదయం సదరు మహిళా టెక్కీ ఆఫీస్ విధులకు వెళ్లేందుకు హాస్టల్ వద్ద క్యాబ్ బుక్ చేసుకుంది. ఆమె క్యాబ్ ఎక్కుతుండగా, అక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డు అకస్మాత్తుగా ఆమె వద్దకు వచ్చి బలవంతంగా పక్కకు లాగి ముద్దు పెట్టుకున్నాడు.

నిందితుడి అరెస్ట్: ఈ ఆకస్మిక చర్యతో షాకైన యువతి గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడ నుంచి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ (CCTV) ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడి వివరాలు: నిందితుడిని జార్ఖండ్‌కు చెందిన రాజ్‌కుమార్‌గా పోలీసులు గుర్తించారు.

 

Follow us on , &

ఇవీ చదవండి