Breaking News

వచ్చే ఎన్నికల్లో మోడీకి ఓటు వేయకుంటే దేశద్రోహులే: ఎంపీ అరవింద్

నిజామాబాద్ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీకి ఓటు వేయకపోతే దేశద్రోహులే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నిన్న కోరుట్లలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, బస్టాండ్ సర్కిల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.


Published on: 27 Feb 2024 14:33  IST

ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో మళ్ళీ బిజెపి విజయ డంకా మోగిస్తుందని, అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని పేర్కొన్నారు. గత 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చేయలేని అభివృద్ధిని, చేయలేని ప్రగతిని, తీసుకురాలేని ప్రపంచ గుర్తింపును 10 సంవత్సరాల లోనే ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపించారని పేర్కొన్నారు.

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లో 5 లక్షల స్వయం సహాయక సంఘాలకు కోట్లాది రూపాయలు ఇచ్చినట్టు వెల్లడించారు. ఇక మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదని పేర్కొన్న ఆయన, నారీ శక్తి బీజేపీ హయాంలోనే అభివృద్ధి చెందిందన్నారు. 7 లక్షలకు పైగా ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇచ్చామని చెప్పుకొచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి