Breaking News

సిట్ ముందు లొంగిపోయాన ప్రభాకర్ రావు

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ ఐపీఎస్ అధికారి టి. ప్రభాకర్ రావు ఈరోజు (డిసెంబర్ 12, 2025) సిట్ (SIT) ముందు లొంగిపోయారు. ఈ కేసులో పోలీసు కస్టడీకి అనుమతిస్తూ సుప్రీంకోర్టు గురువారం (డిసెంబర్ 11, 2025) ఉత్తర్వులు జారీ చేసింది.


Published on: 12 Dec 2025 11:53  IST

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ ఐపీఎస్ అధికారి టి. ప్రభాకర్ రావు ఈరోజు (డిసెంబర్ 12, 2025) సిట్ (SIT) ముందు లొంగిపోయారు. ఈ కేసులో పోలీసు కస్టడీకి అనుమతిస్తూ సుప్రీంకోర్టు గురువారం (డిసెంబర్ 11, 2025) ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలలోపు దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, ప్రభాకర్ రావు ఈ ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో దర్యాప్తు అధికారి ఏసీపీ వెంకటగిరి ఎదుట సరెండర్ అయ్యారు.

ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఆయన విచారణ కొనసాగుతోంది. విచారణ సమయంలో ఆయనకు భౌతికంగా ఎలాంటి హాని తలపెట్టకుండా చట్ట ప్రకారం వ్యవహరించాలని సుప్రీంకోర్టు దర్యాప్తు సంస్థను ఆదేశించింది.ప్రభాకర్‌రావును వారం రోజుల పాటు పోలీసు కస్టడీకి సుప్రీంకోర్టు అనుమతించింది. గతంలో విచారణకు సహకరించకపోవడంతో, పోలీసులు ఆయన కస్టడీ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

Follow us on , &

ఇవీ చదవండి