Breaking News

ఏసీబీ చేతికి నిజామాబాద్ ఎక్సైజ్ ఆఫీసర్

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కే. మల్లారెడ్డిని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈరోజు (23 జూన్ 2026) అదుపులోకి తీసుకున్నారు.


Published on: 23 Jun 2026 14:49  IST

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కే. మల్లారెడ్డిని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈరోజు (23 జూన్ 2026) అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై వచ్చిన అవినీతి ఫిర్యాదుల నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజాము నుంచే ఏసీబీ అధికారులు ఏకకాలంలో భారీ సోదాలు నిర్వహించారు.

నిజామాబాద్, హైదరాబాద్‌తో పాటు సుమారు 10 నుండి 11 ప్రాంతాల్లోని ఆయన నివాసాలు, బంధువుల ఇళ్లపై ఏసీబీ బృందాలు దాడులు చేశాయి.నిజామాబాద్‌లోని ప్రగతినగర్‌లో మల్లారెడ్డి ఉంటున్న నివాసంలోనూ, ఆయన కార్యాలయంలోనూ తనిఖీలు చేపట్టి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.హైదరాబాద్‌లోని మచ్చబొల్లారంలో ఉన్న ఆయన సొంత ఇల్లు, సన్నిహితుల ఇళ్లలో సోదాలు జరిగాయి.

సోదాల్లో భారీగా అక్రమాస్తులు, బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన పత్రాలు మరియు విలువైన రికార్డులను అధికారులు గుర్తించారు.ప్రగతినగర్ నివాసంలో తనిఖీల అనంతరం మల్లారెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని, తదుపరి విచారణ కోసం హైదరాబాద్‌కు తరలించారు.మల్లారెడ్డి గత ఆరేళ్లుగా నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి