Breaking News

ప్రభుత్వ పాఠశాలలో బయో టాయిలెట్‌లు

హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అత్యాధునికమైన, చైనా నుండి తెప్పించిన కంటైనర్ బయో టాయిలెట్‌లు నేడు అందుబాటులోకి వచ్చాయి. అందుబాటులోకి తెచ్చినవారు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ASCI) సంస్థ వీటిని పాఠశాలకు అందించింది.


Published on: 13 Nov 2025 10:41  IST

హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అత్యాధునికమైన, చైనా నుండి తెప్పించిన కంటైనర్ బయో టాయిలెట్‌లు నేడు అందుబాటులోకి వచ్చాయి. అందుబాటులోకి తెచ్చినవారు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ASCI) సంస్థ వీటిని పాఠశాలకు అందించింది.ఇవి నీటిని నిరుపయోగం చేయవు. వీటిని ఉపయోగించినప్పుడు వచ్చే వ్యర్థాలు, నీరు కంటైనర్ సమీపంలో భూమిలో ఏర్పాటుచేసిన సెప్టిక్ ట్యాంకుల్లోకి వెళ్తాయి.పాఠశాల విద్యార్థులకు, ముఖ్యంగా బాలికలకు పరిశుభ్రమైన, క్రియాత్మకమైన మరుగుదొడ్ల సౌకర్యాన్ని కల్పించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మరియు విద్యకు ఆటంకం కలగకుండా చూడటం ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం.తెలంగాణలోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల సమస్యలు ఉన్న నేపథ్యంలో ఈ కొత్త సదుపాయం ఒక సానుకూల పరిణామంగా పరిగణించబడుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి