Breaking News

మానసికస్థితి సరిగాలేని యువతిపై అత్యాచారం

నిజామాబాద్ జిల్లాలోని బోధన్  మండలంలో మానసిక స్థితి సరిగా లేని ఒక యువతిపై అత్యాచారయత్నం జరిగినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది.


Published on: 18 Feb 2026 14:16  IST

నిజామాబాద్ జిల్లాలోని బోధన్  మండలంలో మానసిక స్థితి సరిగా లేని ఒక యువతిపై అత్యాచారయత్నం జరిగినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు మరణించడంతో తన పిన్నమ్మ వద్ద నివసిస్తున్న 23 ఏళ్ల యువతి.సోమవారం సాయంత్రం ఆ యువతిని కిరాయి ఆటోలో ఎక్కించుకుని గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికంగా వేధించిన ఒక ఆటో డ్రైవర్.

ఈ ఘటనపై బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు బోధన్ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి తోడు, కొద్దిరోజుల క్రితం బోధన్‌లో ఒక మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఒక మున్సిపల్ కౌన్సిలర్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి