Breaking News

మతిస్థిమితం లేనియువతిపై అత్యాచారం

హైదరాబాద్‌లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 30 మార్చి 2026న మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారం జరిగిన అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది.


Published on: 30 Mar 2026 16:23  IST

హైదరాబాద్‌లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 30 మార్చి 2026న మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారం జరిగిన అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. రాజేంద్రనగర్ మండలం, అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హాసన్ నగర్.అదే ప్రాంతానికి చెందిన అఖిల్ అనే యువకుడిని పోలీసులు నిందితుడిగా గుర్తించి, అరెస్ట్ చేశారు.

బాధితురాలు మానసిక స్థితి సరిగా లేని యువతి. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయాన్ని గమనించిన నిందితుడు లోపలికి చొరబడి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులు యువతి పరిస్థితిని గమనించి అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి