Breaking News

సనత్‌నగర్‌లో మహిళా పైలట్‌పై వేధింపుల ఘటన

హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో ఒక మహిళా పైలట్‌పై వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలు సనత్‌నగర్ ప్రాంతానికి చెందిన ఒక మహిళాపైలట్.ప్రధాన నిందితుడు కల్ట్ జిమ్ (Cult Gym) ఫిట్‌నెస్ మేనేజర్ సంతోష్ గౌడ్. సహకరించిన వ్యక్తి నిందితుడి గర్ల్ ఫ్రెండ్ రజనీ.


Published on: 13 Jun 2026 10:15  IST

హైదరాబాద్‌లోని సనత్నగర్లో ఒక మహిళా పైలట్పై వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలు సనత్‌నగర్ ప్రాంతానికి చెందిన ఒక మహిళాపైలట్.ప్రధాన నిందితుడు కల్ట్ జిమ్ (Cult Gym) ఫిట్‌నెస్ మేనేజర్ సంతోష్ గౌడ్. సహకరించిన వ్యక్తి నిందితుడి గర్ల్ ఫ్రెండ్ రజనీ.

జిమ్ ట్రైనింగ్ పేరుతో మేనేజర్ సంతోష్ గౌడ్ సదరు మహిళా పైలట్‌ను లోబర్చుకోవడానికి ప్రయత్నించాడు.అతని ప్రవర్తనకు ఆమె ఒప్పుకోకపోవడంతో, కక్ష్యతో ఇన్‌స్టాగ్రామ్ సోషల్ మీడియా వేదికగా ఆమెపై అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతూ వేధింపులకు గురిచేశాడు.ఈ వేధింపుల ప్రక్రియలో సంతోష్ గౌడ్‌కు అతని స్నేహితురాలు రజనీ కూడా సహకరించినట్లు బాధితురాలు పేర్కొంది.ఈ వేధింపులపై బాధితురాలు సనత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు సంతోష్ గౌడ్‌తో పాటు రజనీపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement