Breaking News

కారులో ఎల్‌పీజీగ్యాస్ నింపుతుండగా భారీపేలుడు

కామారెడ్డి జిల్లాలో 2026 మే 9వ తేదీన ఒక కారులో ఎల్‌పీజీ గ్యాస్ నింపుతుండగా భారీ పేలుడు సంభవించింది.కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Published on: 09 May 2026 14:58  IST

కామారెడ్డి జిల్లాలో 2026 మే 9వ తేదీన ఒక కారులో ఎల్‌పీజీ గ్యాస్ నింపుతుండగా భారీ పేలుడు సంభవించింది.కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఒక కారులో అక్రమంగా ఎల్‌పీజీ గ్యాస్ నింపుతుండగా ఒక్కసారిగా కారులోని గ్యాస్ ట్యాంకర్ పేలిపోయింది.ఈ పేలుడు ధాటికి గ్యాస్ నింపుతున్న కారుతో పాటు, దాని పక్కనే పార్క్ చేసి ఉన్న మరో రెండు కార్లు, ఒక బైక్ కూడా పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.పేలుడు ధాటికి దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది  ఘటనా స్థలకి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి