Breaking News

హెలికాప్టర్ సేవల ప్రారంభించిన సీతక్క

మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెలికాప్టర్ సేవలను 22 జనవరి 2026న మంత్రి సీతక్క (దానసరి అనసూయ) అధికారికంగా ప్రారంభించారు. 

Published on: 22 Jan 2026 19:00  IST

మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెలికాప్టర్ సేవలను 22 జనవరి 2026న మంత్రి సీతక్క (దానసరి అనసూయ) అధికారికంగా ప్రారంభించారు. 

ములుగు సమీపంలోని గట్టమ్మ దగ్గర గల డిగ్రీ కళాశాల మైదానంలో మంత్రి ఈ సేవలను జెండా ఊపి ప్రారంభించారు.ఒక్కొక్కరికి సుమారు ₹35,999 చొప్పున ఛార్జీ నిర్ణయించారు.మేడారం జాతరను ఆకాశం నుండి వీక్షించేందుకు 6 నుంచి 7 నిమిషాల ప్రయాణానికి ఒక్కొక్కరికి ₹4,800 - ₹5,000 వరకు ఉంటుంది.

ఈ హెలికాప్టర్ సేవలు జనవరి 22 నుండి జాతర ముగిసే వరకు (జనవరి 31 వరకు) ప్రతిరోజూ ఉదయం 8:00 నుండి సాయంత్రం 5:20 వరకు అందుబాటులో ఉంటాయి.

భక్తులు త్వరగా దర్శనం చేసుకునేందుకు మరియు రద్దీని దృష్టిలో ఉంచుకుని పర్యాటక శాఖ సహకారంతో ఈ సౌకర్యాన్ని కల్పించారు. 

Follow us on , &

ఇవీ చదవండి