Breaking News

ఖమ్మం లేదా భువనగిరి నుంచి రాహుల్ గాంధీ పోటీ??

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి లోక్ సభ కు పోటీ చేయనున్నట్లు సమాచారం. ఖమ్మం లేదా భువనగిరి నుంచి బరిలో దిగుతారని తెలుస్తోంది. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రాష్ట్రం నుంచి పోటీ చేయించాలని భావించారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల ఆమెను కలిసి విజ్ఞప్తి చేశారు. కానీ ఆరోగ్యం, వయసు రీత్యా ఆమె రాజ్యసభకు నామినేట్ అయ్యారు.


Published on: 27 Feb 2024 11:45  IST

రాహుల్‌  గాంధీ  ప్రస్తుతం కేరళలోని వయనాడ్‌ ఎంపీగా ఉన్న రాహుల్‌ను.. ఈసారి తెలంగాణ నుంచి పోటీ చేయించే అంశంపై కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తదితరులతో ముఖ్యమంత్రి చర్చించినట్లు తెలుస్తుంది. అలాగే రాహుల్‌ కూడా తెలంగాణ నుంచి పోటీ చేసేందుకు ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఖమ్మం లేదా భువనగిరి నుంచి అగ్రనేత పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీ నుంచి కూడా ఆయన పోటీ చేస్తారని కాంగ్రెస్‌లో మరో చర్చ జరుగుతోంది. సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహించిన రాయ్‌బరేలి నుంచి ప్రియాంకాగాంధీ పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం.

ఇక రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా ఉన్నారు. అక్కడ వయనాడ్ స్థానంలో కమ్యూనిస్టు పార్టీలు పోటీ చేయనున్నారు. అందుకే ఈ సారి తెలంగాణ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
 

Follow us on , &

ఇవీ చదవండి