Breaking News

సమ్మెలో భాగంగా సింగరేణిలో కార్మికుల నిరసన

నేడు (12 ఫిబ్రవరి 2026) దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా సింగరేణిలో కూడా కార్మికులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.


Published on: 12 Feb 2026 16:25  IST

నేడు (12 ఫిబ్రవరి 2026) దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా సింగరేణిలో కూడా కార్మికులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.రామగుండం ఏరియాలోని ఆర్‌జీ-1, ఆర్‌జీ-2, ఆర్‌జీ-3 మరియు ఏపీఏ ప్రాంతాల్లోని భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులలో పర్మనెంట్ మరియు కాంట్రాక్ట్ కార్మికులు స్వచ్ఛందంగా విధులను బహిష్కరించారు. దీనివల్ల బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను అడ్డుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

సింగరేణి జేఏసీ (JAC) ఆధ్వర్యంలో AITUC, INTUC, HMS, CITU వంటి ప్రధాన సంఘాలు ఈ సమ్మెలో పాల్గొన్నాయి. బీఎంఎస్ (BMS) మినహా మిగిలిన అన్ని సంఘాలు మద్దతు తెలిపాయి.

ఒకరోజు సమ్మె వల్ల సింగరేణికి సుమారు ₹12 కోట్ల వరకు జీతాల నష్టం వాటిల్లుతుందని మరియు ఉత్పత్తి లక్ష్యాలపై ప్రభావం పడుతుందని యాజమాన్యం హెచ్చరించింది.సమ్మె జరుగుతున్న తరుణంలోనే, రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కొత్త సీఎండీగా సీనియర్ ఐఏఎస్ అధికారి జ్యోతి బుద్ధ ప్రకాష్‌ను నియమించింది.

Follow us on , &

ఇవీ చదవండి