Breaking News

పెళ్లి ఖర్చులకు డబ్బులు లేక ఆత్మహత్య

మెదక్ జిల్లా, నర్సాపూర్‌లోని శివాలయం వీధికి చెందిన 38 ఏళ్ల పిచ్కారి రమేశ్, పెళ్లి ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో మనస్తాపానికి గురై 2025 అక్టోబర్ 28న రాయారావు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 

Published on: 29 Oct 2025 14:19  IST

మెదక్ జిల్లా, నర్సాపూర్‌లోని శివాలయం వీధికి చెందిన 38 ఏళ్ల పిచ్కారి రమేశ్, పెళ్లి ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో మనస్తాపానికి గురై 2025 అక్టోబర్ 28న రాయారావు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 

నర్సాపూర్ పట్టణంలోని శివాలయం వీధిలో నివాసముండే రమేశ్, మటన్ షాపు నడుపుతూ జీవించేవాడు.అతనికి పెళ్లి కుదిరినప్పటికీ, పెళ్లి ఖర్చుల కోసం డబ్బులు లేకపోవడంతో నిరాశకు గురయ్యాడని తెలిసింది. ఆయనకు పెళ్లి కుదిరినప్పటికీ, ఖర్చుల కోసం డబ్బులు సమకూర్చలేక బాధపడ్డాడు.అప్పుల కోసం స్నేహితులను, తెలిసిన వారిని ప్రతిరోజూ అడిగేవాడు.అక్టోబరు 28న ఇంటి నుంచి బయటకు వెళ్లి వస్తానని తల్లికి చెప్పి వెళ్ళాడు.దీంతో మంగళవారం రోజున అతడు రాయారావు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ ఘటనపై ఎస్ఐ రంజిత్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి