

సింగరేణిలో అత్యంత కీలకమైన సెక్యూరిటీ, వైద్య శాఖలకు ఉన్నతాధికారులుగా సింగరేణి ఉద్యోగులై ఉంటేనే బాగుంటుంది..టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సురేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు పెట్టం లక్షణ్
సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ పద్ధతిలో చీఫ్ మెడికల్ ఆఫీసర్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేయడం దుర్మార్గమని టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సురేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు పెట్టం లక్షణ్ పేర్కొన్నారు.
Published on: 17 Mar 2025 17:03 IST
శ్రీరాంపూర్, మార్చి 16 : సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ పద్ధతిలో చీఫ్ మెడికల్ ఆఫీసర్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేయడం దుర్మార్గమని టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సురేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు పెట్టం లక్షణ్ పేర్కొన్నారు. ఆదివారం స్థానికంగా వారు విలేకరులతో మాట్లాడారు. సింగరేణిలో అత్యంత కీలకమైన సెక్యూరిటీ, వైద్య శాఖలకు ఉన్నతాధికారులుగా సింగరేణి ఉద్యోగులై ఉంటేనే బాగుంటుందన్నారు.
కాంట్రాక్ట్ పద్ధతిలో నియమిస్తే అక్రమాలకు పాల్పడే ఆస్కారముంటుందని, ఆ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం డిప్యూటీ జనరల్ సెక్రటరీ బండి రమేశ్, కేంద్ర చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పొగాకు రమేశ్, కేంద్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అన్వేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.