Breaking News

సీసీ కెమెరాలు మూడో నేత్రంగ పనిచేస్తాయని సూర్యాపేట జిల్లా ఆత్మ‌కూర్‌.ఎస్ మండ‌ల ఎస్ఐ బి.శ్రీ‌కాంత్ గౌడ్ అన్నారు.

ఆత్మకూర్.ఎస్‌ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2002-03 ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థులు పాఠశాలకు నాలుగు సీసీ కెమెరాలు బ‌హూక‌రించ‌గా ఎస్ఐ సోమ‌వారం వాటిని ప్రారంభించారు.


Published on: 25 Mar 2025 15:01  IST

సీసీ కెమెరాలు భద్రతను మెరుగుపరిచే మూడో కన్నుగా పనిచేస్తాయని సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండల ఎస్ఐ బి.శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2002-03 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు తమ పాఠశాలకు నాలుగు సీసీ కెమెరాలను అందజేయగా, సోమవారం ఎస్ఐ వాటిని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాలలు ఆలయాలతో సమానమని, విద్యార్థులకు మంచి మార్గనిర్దేశం చేసే ప్రదేశాలుగా ఉండాలని పేర్కొన్నారు. అయితే, కొంతకాలంగా కొందరు వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాఠశాలల ప్రాంగణాన్ని ఉపయోగిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు.ఇప్పుడు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పాఠశాల పరిసరాల్లో జరిగే అనైతిక కార్యకలాపాలను గుర్తించేందుకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం శ్రావణ్ కుమార్, పూర్వ విద్యార్థులు చిత్తలూరి వెంకన్న, దాసరి మాల్సూర్, చల్లా శ్రీనివాస్ రెడ్డి, గునిగంటి అంజయ్య, బట్టిపల్లి వెంకన్న, కిరణ్, పంచాయతీ కార్యదర్శి సుధాకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి