Breaking News

తమ ప్రభుత్వం సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.

గత పదేళ్ల కాలంలో తెలంగాణలో బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఉత్పన్నమైన సమస్యలను తమ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.


Published on: 21 Mar 2025 11:37  IST

తెలంగాణలో గత దశాబ్దంలో ఎదురైన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో నిర్వహించిన ‘ప్రజాపాలనలో కొలువుల పండగ’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ‘బిల్డ్‌ నౌ పోర్టల్‌’ను ప్రారంభించారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖల్లో కారుణ్య నియామకాలకు సంబంధించి 922 మందికి నియామక పత్రాలు అందజేశారు.

నా మీద ప్రజలలో వ్యతిరేకత, కోపం ఉందని కొందరు అంటున్నారు.“రైతు రుణ మాఫీ చేశామని కోపమా? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామనే కోపమా?మహిళలను కోటిశ్వరులను చేసేందుకు ప్రయత్నం చేస్తున్నందుకు కోపమా? 59,000 మందికి ఉద్యోగాలు కల్పించామనే కోపమా? అంటూ ఆయన ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. "తెలంగాణ ప్రజలు మా విధానాలను అర్థం చేసుకుంటున్నారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఇదే అని నిరూపించుకుంటాం" అని తెలిపారు.

కొంతమంది పాలనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని, తాము అన్యాయానికి తలొగ్గబోమని స్పష్టం చేశారు. నేను జెడ్పీటీసీ నుంచి 20 ఏళ్లలో ఏం తెలియకుండానే ఇంత దూరం వచ్చానా?. మనుషులు ఎలా ఉంటారో, మానవ మృగాలు ఎలా ఉంటారో నాకు తెలుసు. నేను విజ్ఞతతో వ్యవహరిస్తున్నాను ’’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

తిరుమల దేవస్థానంలో ఎమ్మెల్యేల లెటర్లపై దర్శనం గురించి ఏపీ ప్రభుత్వాన్ని, టీటీడీ అధికారులను ప్రతీసారి అడుక్కోవడం ఏమిటని ప్రశ్నించారు. వాళ్లకు టీటీడీ ఉంటే తెలంగాణకు వైటీడీ (యాదగిరిగుట్ట దేవస్థానం) లేదా? అని ప్రశ్నించారు. ‘‘యాదగిరిగుట్టలో మనం పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకున్నాం.మనకు భద్రాచలంలో రాములవారు లేరా? లక్ష్మీనరసింహస్వామి లేరా? రామప్పలో శివాలయాలు లేవా?’’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి