Breaking News

మంత్రి సీతక్క భర్త కామ్రేడ్ కుంజ రాము 20వ వర్ధంతి నిర్వహించారు.

మంత్రి సీతక్క భర్త కామ్రేడ్ కుంజ రాము 20వ వర్ధంతి - రాము చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు - భర్తని గుర్తు చేసుకుని కంటతడి పెట్టిన సీతక్క


Published on: 28 Mar 2025 10:18  IST

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం మొకాల్లాపల్లిలో మంత్రి సీతక్క భర్త, కామ్రేడ్ కుంజ రాము 20వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, అరుణోదయ సాంస్కృతిక సమైక్య చైర్మన్ విమలక్క పాల్గొని, రాము చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో పలువురు వక్తలు ఆయన పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు.

ఈ సందర్భంగా కామ్రేడ్ రాముపై ప్రజా కళాకారులు రాసిన పాటల సీడీని సీతక్క, విమలక్క చేతుల మీదుగా ఆవిష్కరించారు. అమరవీరులను స్మరించుకుంటూ విమలక్క భావోద్వేగానికి లోనయ్యారు. సీతక్క కూడా తన భర్తను గుర్తు చేసుకుని కంటతడి పెట్టడంతో సభాస్థలం కొద్దిసేపు నిశ్శబ్దంగా మారింది.

సీతక్క మాట్లాడుతూ, కామ్రేడ్ రాము చిన్ననాటి నుంచే విప్లవ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని, ఆదివాసీల హక్కుల కోసం అంకితభావంతో పోరాడారని చెప్పారు. ఆదివాసి ఉద్యమాల వైపు సాగుతున్న క్రమంలో పోలీసులు ఎన్​కౌంటర్​లో మృతి చెందారని గుర్తు చేసుకున్నారు. రాము మరణించి 20 ఏళ్లైనా ఆయన ఆశయాలు ప్రజల్లో జీవించి ఉన్నాయని, ప్రజా సంక్షేమం కోసం తాము అంకితభావంతో పనిచేస్తామని స్పష్టం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి