Breaking News

బెట్టింగ్ యాప్ భూతానికి మరో యువకుడు బలయ్యాడు.

బెట్టింగ్ యాప్ భూతానికి మరో యువకుడు బలయ్యాడు. నిజామాబాద్‌ జిల్లా ఆకుల కొండూర్‌‌లో ఆకాష్ అనే యువకుడు బెట్టింగ్ లో రూ. 5 లక్షలు పోగొట్టుకున్నాడు. దీంతో ఆకాష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చివరికి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.


Published on: 02 Apr 2025 16:19  IST

బెట్టింగ్ యాప్‌ కారణంగా యువకుడి విషాదాంతం

నిజామాబాద్: బెట్టింగ్ యాప్‌ మాయలో పడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. నిజామాబాద్‌ జిల్లా ఆకులకొండూర్‌కు చెందిన ఆకాష్ ఆన్లైన్‌ బెట్టింగ్‌కు అలవాటు పడి రూ.5 లక్షలు కోల్పోయాడు.

ఈనష్టాన్ని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించినా, చికిత్స పొందుతూ చివరకు మృతి చెందాడు.

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ వల్ల ఎన్నో కుటుంబాలు నష్టపోతున్నా, యువతకు ఇది గుణపాఠం కావడం లేదు. ఈ ప్రమాదకరమైన ఆటలపై నియంత్రణ అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి