Breaking News

కాంగ్రెస్‌ తప్పుడు లెక బట్టబయలు.. బీఆర్‌ఎస్‌పై చేసింది దుష్ప్రచారమే

కాంగ్రెస్‌ కపట నాటకం మరోసారి బట్టబయలైంది. కేసీఆర్‌ పాలనలో చేసిన అప్పుల మీద కాంగ్రెస్‌ చెప్పేవన్నీ తప్పుడు లెకలేనని మరోసారి తేలిపోయింది.


Published on: 28 Mar 2025 11:02  IST

CAG నివేదిక: కాంగ్రెస్‌ తప్పుడు లెక్కల బండారం బయటపడింది

హైదరాబాద్‌, మార్చి 27: తెలంగాణలో అప్పులపై కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలు మరోసారి అసత్యంగా తేలిపోయాయి. కేసీఆర్‌ హయాంలో తీసుకున్న అప్పులపై చేస్తున్న దుష్ప్రచారమని తప్పుడు లెకలేనని మరోసారి తేలిపోయింది. అసెంబ్లీలో ప్రభుత్వమే గణాంకాలతో వెల్లడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన భారత కంప్ట్రోలర్‌ మరియు ఆడిటర్‌ జనరల్‌ (CAG) నివేదికను గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

CAG నివేదిక ప్రకారం, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా కాంగ్రెస్‌ నేతలు రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు తేలింది. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందంటూ ఎన్నికల ముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్‌ చేసిన ఆరోపణలు నిరాధారమని తేల్చింది. ఈ నివేదిక ఆర్థిక లెక్కలతో పాటు స్పష్టమైన వివరణను అందించిందని ప్రభుత్వం పేర్కొంది.

రాష్ట్ర ఆదాయం పూర్తిగా అప్పుల తీర్చడానికే ఉపయోగపడుతోందన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో నిజం ఏమిటో బయటపడింది. తమ పాలనలో ఆదాయంలో వచ్చిన లోటును దాచిపెట్టేందుకే కాంగ్రెస్‌ తప్పుడు ఆరోపణలు చేస్తోందని నివేదిక స్పష్టం చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా చేస్తున్న ఈ ప్రకటనలు నిజానికి భిన్నంగా ఉన్నాయని తేలింది.

కాగ్‌ నివేదిక ప్రకారం…

2024 మార్చి 31 నాటికి తెలంగాణ మొత్తం అప్పు రూ. 5,17,659 కోట్లు

బడ్జెట్‌ రుణాలు రూ.3,96,715 కోట్లు

బడ్జెటేతర రుణాలు రూ.1,20,944 కోట్లు

తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రం నుంచి వారసత్వంగా వచ్చిన అప్పు రూ. 72 వేల కోట్లు

2023 డిసెంబర్‌ – 2024 మార్చి మధ్య కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన అప్పులు రూ. 26 వేల కోట్లు

మొత్తం రూ. 98 వేల కోట్లు

అంటే కేసీఆర్‌ పాలన కాలంలో చేసిన అప్పు రూ. 4,19,659 కోట్లు

కాగ్‌ చెప్పిన లెక ఇది

ప్రభుత్వం ప్రతినెల ఒకటో తేదీన అసలు రూ. 6500 కోట్లు వడ్డీ రూ. 6500 కోట్లు చెల్లిస్తున్నది.

– కాంగ్రెస్‌ చేస్తున్న అసత్య ప్రచారం

అంటే చెల్లిస్తున్న దానికన్నా మూడింతలు పెంచి అభాండాలు మోపుతున్నది

బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రంపై మోపిన అప్పు రూ.7 లక్షల కోట్లు

– కాంగ్రెస్‌ చేస్తున్న ప్రచారం ఇది

అంటే.. వాస్తవ అప్పును రెట్టింపు చేసి దుష్ప్రచారం

అసలు, వడ్డీ కలిపి ప్రభుత్వం ప్రతి నెలా చెల్లిస్తున్నది రూ. 4500 కోట్లు

Follow us on , &

ఇవీ చదవండి