Breaking News

తన కూతురును ప్రేమించాడన్న కోపంతో ఆ తండ్రే కిరాతకంగా యువకుడిపై దాడి చేశాడు.

పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నయువకుడిపై ఆకస్మాత్తుగా గొడ్డలితో దాడి తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందాడు.


Published on: 28 Mar 2025 12:10  IST

పెద్దపల్లి జిల్లాలో దారుణ పరువు హత్య

రాష్ట్రాన్ని తీవ్రంగా కలచివేసే మరో పరువు హత్య సంఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని ముప్పిరితోటలో చోటుచేసుకుంది. ఓ యువకుడిని గొడ్డలితో దారుణంగా నరికి హత్య చేశారు. ఈ ఘటన వెనుక అమ్మాయి తండ్రి హస్తం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ప్రేమ సంబంధమే కారణం

తన కూతురును ప్రేమించాడన్న కోపంతో ఆ తండ్రే కిరాతకంగా యువకుడిపై దాడి చేశాడు. పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న సమయంలో ఆకస్మాత్తుగా గొడ్డలితో దాడికి తెగబడ్డాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందాడు.

పోలీసుల దర్యాప్తు

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని భావిస్తున్న పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకునే దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Follow us on , &

ఇవీ చదవండి