Breaking News

Kolkata: కోల్‌కతా, పశ్చిమ బెంగాల్ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా..?

పశ్చిమ బెంగాల్ (West Bengal) రాజధాని కోల్‌కతాకు (Kolkata) సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. బహుశా వీటి గురించి మనలో చాలా మందికి తెలియకపోవచ్చు.


Published on: 07 Mar 2023 16:40  IST

దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన కోల్‌కతాకు (Kolkata) ఎంతో ఘన చరిత్ర ఉంది. అది సామాజిక, రాజకీయ, చారిత్రక, ఆధ్యాత్మిక, సంస్కృతి సంప్రదాయికల సమ్మేళనంతో నిండి ఉంది. ఇప్పటికీ అక్కడ బ్రిటీష్ కాలం నాటి కట్టడాలు చెక్కుచెదరకుండా ఉన్నాయి. అవి ప్రస్తుతం పర్యాటక ఆకర్షణలుగా కొనసాగుతున్నాయి. 17వ దశాబ్దంలో బ్రిటీషర్లు మొదట ఈ నగరం నుంచే పాలన సాగించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ సైతం ఇక్కడి నుండే మొదలెట్టారు. తర్వాత దేశం మొత్తం ఆక్రమించుకొని పాలన సాగించారు. అలాంటి చారిత్రక నేపథ్యమున్న కో‌ల్‌కతాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు బహుశా మీకు తెలియకపోవచ్చు. అవేంటో ఇక్కడ చూద్దాం.

మొదట కోల్‌కతా దేశ రాజధాని.

మొదట దేశ రాజధాని కోల్‌కతానే. 17వ దశాబ్ధంలో భారత దేశంలోకి ప్రవేశించిన బ్రిటీషర్లు తర్వాత కోల్‌కతాను దేశ రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. అలా అక్కడే ఈస్ట్ ఇండియా కంపెనీ మొదలెట్టి దేశం మొత్తం ఆక్రమించుకున్నారు. అయితే, 1911లో కింగ్ జార్జ్ V దేశ రాజధానిని కోల్‌కతా నుండి దిల్లీకి మార్చారు. అప్పటి నుండి దిల్లీ మనకు క్యాపిటల్‌గా మారింది. అంటే అంతకుముందు కోల్‌కతానే రాజధానిగా సేవలందించింది.

క్వీన్ విక్టోరియా మెమోరియల్.

కోల్‌కతాలో ప్రధానంగా ఆకర్షించేది కలోనియల్ (వలస) ఆర్కిటెక్చర్. అక్కడ బ్రిటీష్ కాలంలో నిర్మించిన పలు చారిత్రక కట్టడాలు ఇప్పుడు మ్యూజియాలు, ఆర్ట్ గ్యాలరీలుగా కొనసాగుతున్నాయి. అందులో ఒకటి క్వీన్ విక్టోరియా మెమోరియల్ బిల్డింగ్. భారత దేశంలో బ్రిటీష్ రాణి విక్టోరియా పారిపాలన జ్ఞాపకార్ధం దాన్ని 1906-1921 మధ్య కాలంలో నిర్మించారు.

అతిపెద్ద భారతీయ లైబ్రరి.

దేశంలోని అతిపెద్ద లైబ్రరీ కోల్‌కతాలోనే ఉంది. ఇక్కడ 26 లక్షలకు పైగా పుస్తకాలు ఉన్నాయని సమాచారం. దీన్ని 1836లో ప్రారంభించినా 1953లోనే సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. మొత్తం 30 ఎకరాల్లో ఉన్న ఈ భారీ లైబ్రరి ఇప్పటికీ టాప్‌ప్లేస్‌లోనే కొనసాగుతోంది. ఒకవేళ మీకు పుస్తకాలు చదివే ఆసక్తి లేకపోయినా ఈ లైబ్రరీని కచ్చితంగా ఒక్కసారైనా చూసి తీరాల్సిందే.

అతిపురాతన భారతీయ మ్యూజియం.

ప్రస్తుతం కోల్‌కతాలోని పార్క్ స్ట్రీట్‌లో ఉన్న భారతీయ మ్యూజియం దేశంలోనే కాకుండా ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లోనూ అతిపెద్ద మల్టీపర్పస్ మ్యూజియంగా కొనసాగుతోంది. మరోవైపు ఇది దేశంలోనే తొలి మ్యూజియంగా నిలవడం విశేషం. అంటే ఇది అతిపురాతన మ్యూజియం అని చెప్పొచ్చు. 1814లో దీని నిర్మాణానికి పునాదులు పడగా తర్వాత దేశంలో ఇతర మ్యూజియాల పెరుగుదలకు కారణంగా నిలిచింది. మరోమాటలో చెప్పాలంటే ఈ మ్యూజియం దేశ సామాజిక-సాంస్కృతిక, శాస్త్రీయ విజయాలకు కేంద్ర బిందువుగా నిలిచింది.

ప్రపంచంలోనే అతిపెద్ద మర్రిచెట్టూ.

ప్రపంచంలోనే అతిపెద్ద మర్రిచెట్టు సైతం కో‌ల్‌కతాలోనే ఉంది. ఆచార్య జగదీశ్ చంద్రబోస్ బొటానికల్ గార్డెన్‌లో ఉన్న ఈ భారీ వృక్షం ప్రస్తుతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ మర్రిచెట్టు మొత్తం 3.5 ఎకరాల్లో విస్తరించి ఉండగా సుమారు 80 అడుగుల ఎత్తు కలిగి ఉంది. దీంతో ఇది ప్రపంచంలోని అతిపెద్ద మర్రిచెట్టుగా రికార్డులకెక్కింది. అలాగే ఇది 1864, 1867లో రెండు సార్లు వచ్చిన భారీ తుఫానులను సైతం తట్టుకొని నిలబడింది. దీంతో ఇది ప్రకృతి‌లో ప్రపంచ వింతగా నిలిచింది.

అత్యంత ఎత్తులో ఉన్న రైల్వేస్టేషన్.

దేశంలోనే అత్యంత ఎత్తులో ఉన్న రైల్వేస్టేషన్‌గా డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే లైన్ పరిధిలో ఉన్న ఘూమ్ రైల్వేస్టేషన్ పేరుగాంచింది. ఇది సముద్ర మట్టానికి 2,258 మీటర్ల ఎత్తులో ఉంది. దీంతో ఇది దేశంలోనే అత్యంత ఎత్తులో ఉన్న రైల్వే స్టేషన్‌గా ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఇక్కడ 1881లో తొలిసారి రైలు పట్టాలపై పరుగులు తీసింది. అప్పటి నుండి ఇప్పటికీ ఈ స్టేషన్ పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

కోల్‌కతాకు అనేక పేర్లు

పశ్చిమ బెంగాల్ రాజధానిగా ఉన్న కోల్‌కతాకు ఎంతో చారిత్రక నేపథ్యం ఉందని ముందే చెప్పుకున్నాం. అందుకు తగ్గట్టే ఈ నగరానికి అనేక ముద్దు పేర్లు ఉన్నాయి. అందులో ప్రధానమైనవి ఇక్కడ తెలుసుకుందా. చాలా మంది ఈ కోల్‌కతాను సిటీ ఆఫ్ జాయ్‌గా పిలుస్తారు, మరికొంత మంది కల్చురల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా భావిస్తారు, ఇంకొందరు సిటీ ఆఫ్ ప్యాలెసెస్ అని, మరింకొందరు సిటీ ఆఫ్ ప్రొసెషన్స్ (ఉత్సవాలు) అని పిలుస్తారు.

అత్యంత రద్దీగల హౌరా బ్రిడ్జి.

ఇక కో‌ల్‌కతా అంటే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది హౌరా బ్రిడ్జే. ఇది నిత్యం రద్దీగా ఉండటంతో దేశంలోనే అత్యంత రద్దీ గల వంతెనగా ప్రత్యేక గుర్తింపు సాధించింది. హూగ్లీ నదిపై ఉన్న ఈ వంతెన కోల్‌కతా, హౌరా నగరాలను కలుపుతుంది. మొత్తం 705 మీటర్లు ఉండే ఈ బ్రిడ్జి 80 ఏళ్ల క్రితమే అందుబాటులోకి వచ్చింది. అంటే ఈ బ్రిడ్జ్ 1943లో ప్రారంభమవ్వడం గమనార్హం.

Follow us on , &

ఇవీ చదవండి