Breaking News

Gokarna Trip in 5000: రూ.5 వేలల్లోనే సూపర్ గోకర్ణ ట్రిప్.. ఇలా ప్లాన్ చేసి చూడండి..!

గోకర్ణ ట్రిప్‌కు (Gokarna Trip) వెళ్లాలనుకుంటే కేవలం రూ.3000లల్లోనే ఎలా వెళ్లి రావాలో, అక్కడ ఏమేం చూడాలనే విషయాలు తెలుసుకుందాం.


Published on: 07 Mar 2023 18:25  IST

కర్ణాటకలోని గోకర్ణ ట్రిప్ మధుర జ్ఞాపకంగా ఉంటుంది. అక్కడి బీచ్‌లు, ఆలయాలు ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకుంటాయి. అది బెంగళూరు, హైదరాబాద్ వాసులకు మంచి వీకెండ్ ట్రిప్ కూడా. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే రెండు రోజుల్లో గోకర్ణతో పాటు చుట్టుపక్కలున్న ప్రాంతాలను తేలిగ్గా కవర్ చేయొచ్చు. అయితే, అక్కడికి హైదరాబాద్ నుండి తక్కువ బడ్జెట్‌లో ఎలా వెళ్లిరావాలో మనం ఇక్కడ చూద్దాం. రూ.3000 వేలల్లోనే గోకర్ణ ట్రిప్‌ను పూర్తి చేయొచ్చు.

 

హైదరాబాద్ నుండి హూబ్లీకి స్లీపర్ క్లాస్ రైలు జర్నీ రూ.370గా ఉంది. అప్ అండ్ డౌన్ లెక్కించుకున్నా మొత్తం రైలు ప్రయాణ ఖర్చు 740 అవుతుంది. ఇక హుబ్లీ నుండి గోకర్ణ‌కు బస్‌లో ప్రయాణిస్తే టికెట్ ధర రూ.178. అదే అప్ అండ్ డౌన్ చూసుకున్నా రూ.356. అంటే రూ.1100‌ల్లో అక్కడికి వెళ్లి రావచ్చు. ఇక అక్కడ హోటల్స్‌లో బస చేస్తే కనీస ధర ఒక రోజుకు రూ.500 నుండి గదులు అందుబాటులో ఉంటాయి. అలా కాకున్నా హాస్టల్స్ లేదా డార్మిటరీల్లో ఉండొచ్చు. దీంతో అలా కూడా మీరు డబ్బు ఆదా చేసుకోవచ్చు.

ఇక భోజనాల విషయానికి వస్తే కనీసం రోజుకు రూ.300 వెచ్చిస్తే సరిపోతుంది. అలాగే స్థానికంగా తిరగడానికి టూ వీలర్ అద్దెకు తీసుకున్నా రూ.500తో ఒక రోజు తిరగొచ్చు. లేదా రెండు రోజులు వెచ్చించినా రూ.1000 ఖర్చవుతుంది. దీంతో మీరు ఈ ట్రిప్‌ని రూ.4 వేలల్లోనే ఆస్వాదించొచ్చు. ఒకవేళ ఏదైనా అనుకోని ఖర్చులు లేదా ఇతర చిన్న చిన్న ఖర్చులు వేసుకున్నా మొత్తంగా రూ.5 వేలల్లో మొత్తం గోకర్ణ ట్రిప్‌ని పూర్తి చేయొచ్చు.

అలాగే అక్కడ చూడాల్సిన ప్రదేశాల విషయాని వస్తే పలు అందమైన బీచ్‌లు ఉన్నాయి. అవి కాకుండా మహాగణపతి ఆలయం, మహాబలేశ్వర్ ఆలయం, రామ తీర్థ, కోటి తీర్థ, శివ గుహలు, మురుడేశ్వర్ ఆలయం, రాజ గోపురం, యానా కేవ్స్, జోగ్ వాటర్ ఫాల్స్, విభూతి వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇవన్నీ కొంచెం ప్లాన్ చేసుకుంటే రెండు రోజుల్లో చుట్టేయొచ్చు. లేదా మాక్సిమమ్ మూడు రోజుల్లో చూసి రావచ్చు.
 

Follow us on , &

Source From: BS News

ఇవీ చదవండి