Breaking News

అమెరికాలోని సియాటెల్ నగరంలో పోలీసు వాహనం ఢీకొని మృతి చెందిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల కుటుంబానికి భారీ పరిహారం లభించింది.

అమెరికాలోని సియాటెల్ నగరంలో పోలీసు వాహనం ఢీకొని మృతి చెందిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల కుటుంబానికి భారీ పరిహారం లభించింది.

Published on: 12 Feb 2026 10:13  IST

అమెరికాలోని సియాటెల్ నగరంలో పోలీసు వాహనం ఢీకొని మృతి చెందిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల కుటుంబానికి భారీ పరిహారం లభించింది. 

సియాటెల్ నగరం జాహ్నవి కుటుంబానికి 29 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 262 కోట్లు) చెల్లించేందుకు అంగీకరించింది.ఈ సెటిల్‌మెంట్‌కు సంబంధించి సియాటెల్ సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ ఫిబ్రవరి 11, 2026న (అమెరికా కాలమానం ప్రకారం) అధికారిక ప్రకటన విడుదల చేశారు.

2023 జనవరిలో మితిమీరిన వేగంతో వెళ్తున్న పోలీసు అధికారి కెవిన్ డేవ్ వాహనం ఢీకొనడంతో జాహ్నవి మరణించింది.ఈ పరిహారంలో సుమారు 20 మిలియన్ డాలర్లను నగరానికి సంబంధించిన ఇన్సూరెన్స్ కంపెనీలు భరించనున్నాయి. ఈ ఒప్పందం ద్వారా జాహ్నవి కుటుంబానికి న్యాయపరంగా కొంత ఉపశమనం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి