Breaking News

బ్రిటన్ (UK) ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ (Keir Starmer) తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు

బ్రిటన్ (UK) ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ (Keir Starmer) తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఇటీవల జరిగిన ప్రాంతీయ మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార లేబర్ పార్టీ భారీ పరాజయాన్ని చవిచూడటంతో ఆయన పదవికి గండం పొంచి ఉంది.

Published on: 13 May 2026 10:33  IST

బ్రిటన్ (UK) ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ (Keir Starmer) తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఇటీవల జరిగిన ప్రాంతీయ మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార లేబర్ పార్టీ భారీ పరాజయాన్ని చవిచూడటంతో ఆయన పదవికి గండం పొంచి ఉంది.

తాజా స్థానిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఇంగ్లండ్‌లోని 1,000 సీట్లతో పాటు దేశవ్యాప్తంగా మొత్తంగా 1,400కు పైగా స్థానాలను కోల్పోయింది.ఈ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ ప్రధాని పదవికి రాజీనామా చేయాలని లేదా పదవి నుంచి తప్పుకోవడానికి గడువు (టైమ్‌లైన్) ప్రకటించాలని డిమాండ్ చేస్తూ లేబర్ పార్టీకి చెందిన 72 మంది ఎంపీలు కీర్ స్టార్మర్‌పై తిరుగుబాటు చేశారు.

తిరుగుబాటు చేసిన ఎంపీలతో పాటు బ్రిటన్ హోం మంత్రి (Home Secretary) శబానా మహమూద్ కూడా ప్రధాని స్టార్మర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం గమనార్హం.గత సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, 14 ఏళ్ల కన్జర్వేటివ్‌ల పాలనకు చరమగీతం పాడిన లేబర్ పార్టీ.. ఏడాది తిరగకముందే తీవ్ర నాయకత్వ సంక్షోభంలో కూరుకుపోయింది.ప్రస్తుతం ప్రధాని కీర్ స్టార్మర్ తన రాజకీయ జీవితంలోనే అత్యంత కఠినమైన సవాలును ఎదుర్కొంటున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి