Breaking News

కెనడాలో విధి నిర్వహణలో ఉండగా భారత సంతతికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ తరుణ్ బాలి దారుణహత్య

కెనడాలో విధి నిర్వహణలో ఉండగా భారత సంతతికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ తరుణ్ బాలి దారుణంగా హత్యకు గురయ్యారు. కెనడాలోని అంటారియో ప్రావిన్షియల్ పోలీస్ (OPP) విభాగంలో ఆయన విధులు నిర్వహిస్తున్నారు.


Published on: 10 Jun 2026 13:51  IST

కెనడాలో విధి నిర్వహణలో ఉండగా భారత సంతతికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ తరుణ్ బాలి దారుణంగా హత్యకు గురయ్యారు. కెనడాలోని అంటారియో ప్రావిన్షియల్ పోలీస్ (OPP) విభాగంలో ఆయన విధులు నిర్వహిస్తున్నారు.

ఉత్తర అంటారియోలోని హిర్స్ట్ పట్టణం సమీపంలో జూన్ 9 మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.కానిస్టేబుల్ తరుణ్ బాలి ఒక కేసు దర్యాప్తులో భాగంగా అక్కడ విధుల్లో ఉండగా, ఒక వ్యక్తి కారుతో ఆయనను బలంగా ఢీకొట్టాడు.తీవ్ర గాయాలపాలైన తరుణ్ బాలిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

ఈ కేసులో పోలీసులు ఒక 18 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేశారు.సదరు యువకుడు మానసిక ఆరోగ్య చట్టం కింద చికిత్స పొందుతూ ఆసుపత్రి నుండి పారిపోయినట్లు గుర్తించారు.అధికారులు అతడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే, అతను కారుతో కానిస్టేబుల్ తరుణ్‌ను ఢీకొట్టాడు.నిందితుడిపై ఫస్ట్-డిగ్రీ మర్డర్ ,ప్రమాదకరమైన డ్రైవింగ్, మరియు పోలీస్ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించడం వంటి తీవ్రమైన నేరాల కింద కేసులు నమోదు చేశారు.

ఆయన అంటారియో పోలీస్ విభాగంలో గత రెండున్నర ఏళ్లుగా కానిస్టేబుల్‌గా సేవలు అందిస్తున్నారు.ప్రస్తుతం ఆయన 'డఫెరిన్' డిటాచ్‌మెంట్ నుండి 'జేమ్స్ బే' డిటాచ్‌మెంట్‌కు తాత్కాలికంగా బదిలీపై వచ్చి విధులు నిర్వహిస్తున్నారు.తరుణ్ బాలి మృతి పట్ల కెనడాలోని పోలీస్ సంఘాలు, ఉన్నతాధికారులు మరియు అంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్ తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపం వ్యక్తం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement