Breaking News

లండన్‌లోని ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్ 36వ అంతస్తు నుండి కిందపడి భారత సంతతికి చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి

లండన్‌లోని ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్ 36వ అంతస్తు (దాదాపు 400 అడుగుల ఎత్తు) నుండి కిందపడి భారత సంతతికి చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు మరణించారు. బ్రిటన్ మీడియా కథనాల ప్రకారం.. ఈ విషాద ఘటన మే 27న దక్షిణ లండన్‌లోని ఎలిఫెంట్‌ అండ్ క్యాజిల్‌ ప్రాంతంలో ఉన్న 'హైపాయింట్' టవర్‌లో జరిగింది.


Published on: 10 Jun 2026 14:13  IST

లండన్‌లోని ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్ 36 అంతస్తు (దాదాపు 400 అడుగుల ఎత్తు) నుండి కిందపడి భారత సంతతికి చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు మరణించారు. బ్రిటన్ మీడియా కథనాల ప్రకారం.. ఈ విషాద ఘటన మే 27న దక్షిణ లండన్‌లోని ఎలిఫెంట్‌ అండ్ క్యాజిల్‌ ప్రాంతంలో ఉన్న 'హైపాయింట్' టవర్‌లో జరిగింది. జూన్ 9, 10 తేదీల్లో ఈ వివరాలు పూర్తిగా వెలుగులోకి వచ్చాయి.

రాకేశ్ నారాయణ్ పాయ్ (47) భర్త, ఫైనాన్స్ కన్సల్టెంట్‌గా పని చేసేవారు.అదితి విజయ్ పరాల్కర్ (46) భార్య, కన్‌స్ట్రక్షన్ రంగంలో సీనియర్ కన్సల్టెంట్.సిద్ (9) వీరి తొమ్మిదేళ్ల కుమారుడు.బాబు సిద్ పుట్టుకతోనే మూత్రపిండాల వ్యాధి, శారీరక వైకల్యం, మాట్లాడలేకపోవడం వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు.ఈ దంపతులు 2020లో బాబుకు చికిత్స కోసం ముంబైకి కూడా వచ్చారు. కానీ పరిస్థితి మెరుగుపడకపోవడంతో తిరిగి లండన్ వెళ్లారు. ఇటీవల బాబుకు ఇకపై ఎలాంటి చికిత్సలు లేవని వైద్యులు తెలపడంతో ఆ కుటుంబం తీవ్ర మానసిక ఒత్తిడికి, డిప్రెషన్‌కు గురైనట్లు తెలుస్తోంది.

లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు దీనిని "మర్డర్-సూసైడ్" (హత్య-ఆత్మహత్య) లేదా "సూసైడ్ ప్యాక్ట్" (సమష్టి ఆత్మహత్య) కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బాబు పరిస్థితిని చూసి తట్టుకోలేకే దంపతులు ఈ ఘోర నిర్ణయం తీసుకుని ఉండవచ్చని స్థానిక ఎంపీ నీల్ కోయ్లే పేర్కొన్నారు.ప్రస్తుతం లండన్ పోలీసులు ఈ కేసుపై ఎటువంటి అంచనాలకు రావద్దని, పూర్తి విచారణ జరిపి నిజానిజాలు తేలుస్తామని ప్రకటించారు.

Follow us on , &

ఇవీ చదవండి