Breaking News

థాయ్‌లాండ్‌లోని ఈశాన్య ప్రావిన్స్‌లో ఒక ప్యాసింజర్ రైలు వెళ్తుండగా, పైన నిర్మాణ పనుల్లో ఉన్న ఒక భారీ క్రేన్ ఒక్కసారిగా రైలుపై కూలిపోయింది.

నేడు, జనవరి 14, 2026 న థాయ్‌లాండ్‌లో ఒక ఘోరమైన రైలు ప్రమాదం సంభవించింది. థాయ్‌లాండ్‌లోని ఈశాన్య ప్రావిన్స్‌లో ఒక ప్యాసింజర్ రైలు వెళ్తుండగా, పైన నిర్మాణ పనుల్లో ఉన్న ఒక భారీ క్రేన్ ఒక్కసారిగా రైలుపై కూలిపోయింది.

Published on: 14 Jan 2026 13:59  IST

నేడు, జనవరి 14, 2026 న థాయ్‌లాండ్‌లో ఒక ఘోరమైన రైలు ప్రమాదం సంభవించింది. థాయ్‌లాండ్‌లోని ఈశాన్య ప్రావిన్స్‌లో ఒక ప్యాసింజర్ రైలు వెళ్తుండగా, పైన నిర్మాణ పనుల్లో ఉన్న ఒక భారీ క్రేన్ ఒక్కసారిగా రైలుపై కూలిపోయింది.

బ్యాంకాక్‌కు సుమారు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న నఖోన్ రాట్చసిమా (Nakhon Ratchasima) ప్రావిన్స్‌లోని సిఖియు జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో 25 మంది మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.ఈ రైలు బ్యాంకాక్ నుండి ఉబోన్ రాట్చథానీకి వెళ్తోంది. ప్రమాద సమయంలో రైలులో సుమారు 150 - 195 మంది ప్రయాణికులు ఉన్నట్లు అంచనా.

హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో భాగంగా ఒక భారీ క్రేన్ ను స్తంభం పైకి ఎత్తుతుండగా, అది అదుపు తప్పి కింద ఉన్న రైలుపై పడింది. దీనివల్ల రైలు పట్టాలు తప్పి, కొన్ని భోగీలకు మంటలు అంటుకున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి