Breaking News

Israel:గాజాపై దాడి సమాచారం తమకు ముందస్తు తెలిపింది: అమెరికా

హమాస్ తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ సైన్యం గాజాపై మళ్లీ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.ఓవైపు రెండో దశ చర్చలకు సిద్ధమవుతూనే గాజాపై బాంబులతో విరుచుకుపడుతోంది.


Published on: 18 Mar 2025 14:35  IST

ఈ క్రమంలోనే సోమవారం గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడి చేసింది. బాంబుల వర్షం కురిపించింది. దీంతో గాజాలో సుమారు 300 మంది వరకు చనిపోయారని మరో 300 మంది వరకు గాయపడినట్లు గాజా ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. సమాచారం. దీనిపై హమాస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఏకపక్షంగా ఉల్లంఘించిందని మండిపడింది.

ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు హమాస్‌ అంగీకరించని కారణంగానే దాడులకు ఆదేశించినట్లు తెలిపారు. ” మా బందీలను విడుదల చేయడానికి హమాస్‌ పదేపదే నిరాకరిస్తోంది. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్‌కాఫ్‌ ప్రతిపాదించిన కాల్పుల ఒప్పందం కొనసాగింపును తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే దాడులకు ఆదేశించాం. యుద్ధం లక్ష్యాలను సాధించడానికి గాజాలోని హమాస్‌ స్థావరాలే లక్ష్యంగా ఐడీఎఫ్‌ దాడులు చేస్తోంది ” అని ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇజ్రాయెల్‌ ఇప్పటినుంచి హమాస్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

బందీలను విడిచిపెట్టాలని, గాజాను వదిలిపెట్టి వెళ్లాలని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే హమాస్ ను హెచ్చరించారని గుర్తుచేశారు. అయితే, ఈ హెచ్చరికలను నిర్లక్ష్యం చేసిన హమాస్.. ప్రస్తుతం దాని ఫలితం అనుభవిస్తోందని పేర్కొన్నారు. కాగా, కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు, బందీల అప్పగింతకు హమాస్ అంగీకరించకపోవడం వల్లే గాజాపై దాడులు జరపాల్సి వచ్చిందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వివరణ ఇచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి