Breaking News

Ugadi Festival 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సర ప్రాముఖ్యతలేంటి.. ఆదాయం అమాంతం పెరుగుతుందా?

Ugadi Festival 2025 హిందూ పంచాంగం ప్రకారం, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అంటే ఏమిటి.. ఉగాది పండుగ చేసే పచ్చడికి ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తారు.. పంచాంగం విశిష్టతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...


Published on: 20 Mar 2025 01:30  IST

ఉగాది పండుగ 2025

తెలుగు క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది మార్చి 30వ తేదీ (ఆదివారం) న ఉగాది పండుగ జరుపుకోనున్నారు. ఈ సంవత్సరం పేరు "శ్రీ విశ్వావసు నామ సంవత్సరం" అని పిలుస్తారు, దీని అర్థం విశ్వానికి సంబంధించి శుభప్రదంగా ఉండే సంవత్సరం అని భావించబడుతుంది.

ఈ కొత్త సంవత్సరం ఆర్థికంగా పురోగతి, వ్యాపారులకు మంచి లాభాలు, కుటుంబ జీవితంలో ఆనందం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెప్పబడింది. అంతేకాదు, దేశాల మధ్య వైరం, యుద్ధ పరిస్థితులు తగ్గే అవకాశాలున్నాయని పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరం విశేషాలు, ఉగాది పండుగ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.

ఉగాది అంటే ఏంటి?

శాస్త్రాల ప్రకారం, "ఉగ" అనే పదానికి నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్ వంటి అర్థాలు ఉన్నాయి. వీటికి ఆది "ఉగాది" అని భావిస్తారు. మరొక కథనం ప్రకారం, "యుగం" అంటే రెండు లేదా జంట అని అర్థం. ఉత్తరాయణం, దక్షిణాయణం కలిపి యుగం (ఏడాది) అవుతుంది, దీని ప్రారంభాన్ని "ఉగాది" అంటారని పండితులు చెబుతున్నారు.

అంతేకాదు, ఉగాది నుంచే వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ఈ కాలంలో చెట్లు చిగురిస్తాయి, కోయిల రాగాలు వినిపిస్తాయి, ప్రకృతి కొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంటుంది. తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాది నుంచే మొదలవుతుంది, అందుకే దీన్ని తెలుగు వారి తొలి పండుగ అని చెబుతారు.

ఈ పవిత్రమైన రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఉదయాన్నే తలస్నానం చేసి, ఇంటిని మామిడాకుల తోరణాలతో అలంకరించి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడిని ఆస్వాదించడం అనాది కాలంగా పాటించే సంప్రదాయం.

Follow us on , &

ఇవీ చదవండి