Breaking News

క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి ఖాన్‌చంద్ సింగ్  శుక్రవారం తెల్లవారుజామున గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 

టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా లివర్ క్యాన్సర్ (Stage-4) తో పోరాడుతున్న ఆయన తండ్రి ఖాన్‌చంద్ సింగ్ (60), ఫిబ్రవరి 27, 2026 శుక్రవారం తెల్లవారుజామున గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 

Published on: 27 Feb 2026 10:30  IST

టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా లివర్ క్యాన్సర్ (Stage-4) తో పోరాడుతున్న ఆయన తండ్రి ఖాన్‌చంద్ సింగ్ (60), ఫిబ్రవరి 27, 2026 శుక్రవారం తెల్లవారుజామున గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 

ఆయన గత ఏడాది కాలంగా నాలుగో దశ లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో కొద్దిరోజులుగా వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు.ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026) లో రింకూ సింగ్ భారత జట్టులో సభ్యుడిగా ఉన్నారు. తండ్రి ఆరోగ్యం క్షీణించడంతో ఆయన ఫిబ్రవరి 25న జట్టును వీడి స్వస్థలానికి వెళ్లారు.

తండ్రి ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో ఫిబ్రవరి 26న జింబాబ్వేతో మ్యాచ్ కోసం మళ్ళీ చెన్నై చేరుకున్నారు. అయితే, జింబాబ్వేపై భారత్ విజయం సాధించిన కొన్ని గంటలకే తండ్రి మరణ వార్త తెలియడంతో ఆయన మళ్ళీ అలిఘర్ చేరుకున్నారు. రింకూ సింగ్ తండ్రి మృతి పట్ల మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మరియు ఇతర క్రీడాకారులు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి