Breaking News

గంజాయి తరలిస్తుండగా ఘోర రోడ్డుప్రమాదం

విజయవాడ బైపాస్ రోడ్డులో గంజాయి తరలిస్తున్న కారు కంటైనర్‌ను ఢీకొట్టడం వల్ల ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ (పాయకాపురం) పరిధిలోని నున్న పోలీస్ స్టేషన్ పరిమితుల్లో గల బైపాస్ రోడ్డుపై సోమవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.


Published on: 16 Jun 2026 18:15  IST

విజయవాడ బైపాస్ రోడ్డులో గంజాయి తరలిస్తున్న కారు కంటైనర్ను ఢీకొట్టడం వల్ల ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ (పాయకాపురం) పరిధిలోని నున్న పోలీస్ స్టేషన్ పరిమితుల్లో గల బైపాస్ రోడ్డుపై సోమవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

తమిళనాడుకు చెందిన నలుగురు యువకులు ఒడిశా-ఆంధ్రా సరిహద్దులో 25 కిలోల గంజాయిని కొనుగోలు చేసి కారులో తరలిస్తున్నారు.కారు నడుపుతున్న వ్యక్తి గంజాయి మత్తులో ఉండటంతో, నున్న సమీపంలో కారు నియంత్రణ కోల్పోయి ముందు వెళ్తున్న కంటైనర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.

కారులో ఉన్న నలుగురు యువకులకు తీవ్ర గాయాలవగా, స్థానికుల సహాయంతో వారిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి చాలా విషమంగా ఉంది.చికిత్స పొందుతున్న సమయంలో వారు గంజాయి మత్తులో ఉండటాన్ని పోలీసులు గమనించారు. ప్రమాద స్థలంలోని కారును తనిఖీ చేయగా 25 కిలోల గంజాయి ప్యాకెట్లు లభ్యమవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిందితుల్లో ఒకడు పోలీసుల కళ్లు గప్పి అక్కడి నుంచి పరారయ్యాడు.ఈ ఘటనపై నున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, పరారైన నిందితుడి కోసం గాలిస్తూ తదుపరి దర్యాప్తును ముమ్మరం చేశారు.

 

Follow us on , &

ఇవీ చదవండి

Advertisement