Breaking News

మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిజిటల్ మోసాలకు గురైన వారికి ఊరటనిచ్చే కీలక ప్రకటన చేసింది. 

ఫిబ్రవరి 6, 2026న జరిగిన మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిజిటల్ మోసాలకు గురైన వారికి ఊరటనిచ్చే కీలక ప్రకటన చేసింది. 


Published on: 07 Feb 2026 18:59  IST

ఫిబ్రవరి 6, 2026న జరిగిన మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిజిటల్ మోసాలకు గురైన వారికి ఊరటనిచ్చే కీలక ప్రకటన చేసింది. డిజిటల్ మోసాల వల్ల డబ్బు నష్టపోయిన బాధితులకు ఒక్కో కేసుకు గరిష్టంగా 25,000 వరకు పరిహారం అందించాలని RBI ప్రతిపాదించింది.

నష్టపోయిన మొత్తంలో 85% లేదా 25,000 వీటిలో ఏది తక్కువైతే అది పరిహారంగా అందుతుంది.వినియోగదారులు పొరపాటున వన్ టైమ్ పాస్‌వర్డ్ ఇతరులకు చెప్పి మోసపోయినప్పటికీ, ఆ నష్టం ఉద్దేశపూర్వకమైనది కాకపోతే ఈ పరిహారం వర్తిస్తుంది.

ఈ సౌకర్యం ఒక వ్యక్తికి తన జీవితకాలంలో కేవలం ఒక్కసారి మాత్రమే లభిస్తుంది.ఈ పరిహారాన్ని డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్  ఫండ్ ద్వారా చెల్లిస్తారు.డిజిటల్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలి లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలి. బ్యాంక్ ఖాతాలో ఏదైనా అనధికారిక లావాదేవీ జరిగితే వెంటనే మీ బ్యాంకుకు కూడా సమాచారం అందించాలి.

Follow us on , &

ఇవీ చదవండి