Breaking News

క్రెడిట్ కార్డు రూల్స్.. ఎస్బీఐ కార్డ్స్ షాకింగ్ ప్రకటన.. ఈ కార్డులపై తగ్గనున్న బెనిఫిట్స్

క్రెడిట్ కార్డులు వినియోగించే వారు.. ఎప్పటికప్పుడు మారుతున్న రూల్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. చాలా వరకు క్రెడిట్ కార్డు జారీ సంస్థలు.. తమ రివార్డులు, క్యాష్ బ్యాక్స్, ఇతర రుసుములు వంటి వాటిని తరచుగా సవరిస్తుంటాయి.


Published on: 19 Mar 2025 15:01  IST

క్రెడిట్ కార్డులు అత్యవసర సమయంలో ఉపయోగపడే ముఖ్యమైన ఆర్థిక సాధనంగా మారాయి. ప్రస్తుతం వాటి వినియోగం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గణాంకాల ప్రకారం, డెబిట్ కార్డులతో పోల్చితే మరింత మంది క్రెడిట్ కార్డుల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇవి వివిధ రకాలుగా లభ్యమవుతూ వినియోగదారులకు ప్రత్యేకమైన ప్రయోజనాలను అందిస్తున్నాయి. కొన్ని క్రెడిట్ కార్డులు షాపింగ్‌పై డిస్కౌంట్లు ఇస్తే, మరికొన్ని క్యాష్‌బ్యాక్ లేదా రివార్డ్స్ పాయింట్లను అందిస్తాయి. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు తమ క్రెడిట్ కార్డు ప్రయోజనాలను కాలానుగుణంగా మారుస్తుంటాయి.

అయితే, ఎస్బీఐ కార్డ్స్ వినియోగదారులకు ముఖ్యమైన అప్డేట్. మార్చి 31, 2025 నుండి కొన్ని ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై రివార్డు పాయింట్లను తగ్గించనుంది. ముఖ్యంగా, స్విగ్గీ ఆర్డర్లు మరియు ఎయిరిండియా టిక్కెట్లపై వచ్చే రివార్డులు తగ్గించబడ్డాయి. ఈ మార్పులు సింప్లీక్లిక్ ఎస్‌బీఐ కార్డు, ఎయిరిండియా ఎస్‌బీఐ ప్లాటినమ్ కార్డు, ఎయిరిండియా ఎస్‌బీఐ సిగ్నేచర్ కార్డు వినియోగదారులకు వర్తిస్తాయి. దీని ద్వారా క్రెడిట్ కార్డు ప్రయోజనాల్లో కొంత మార్పు వచ్చినట్లు చెప్పుకోవచ్చు. కనుక, మీరు ఈ కార్డుల వినియోగదారుడైతే, మార్చి 31 తర్వాత అమలులోకి వచ్చే కొత్త నిబంధనలను తెలుసుకోవడం అవసరం.

Follow us on , &

ఇవీ చదవండి