Breaking News

నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ (NPL) పదో తరగతి మరియు ఐటీఐ అర్హత ఉన్న అభ్యర్థుల కోసం 20 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

న్యూఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) - నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ (NPL), పదో తరగతి మరియు ఐటీఐ అర్హత ఉన్న అభ్యర్థుల కోసం 20 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.


Published on: 18 Jun 2026 19:15  IST

న్యూఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) - నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ (NPL), పదో తరగతి మరియు ఐటీఐ అర్హత ఉన్న అభ్యర్థుల కోసం 20 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఖాళీల వివరాలు

వివిధ విభాగాల వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి:

ఎలక్ట్రానిక్స్ : 10 పోస్టులు

ఎలక్ట్రికల్ : 05 పోస్టులు

కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA): 02 పోస్టులు

మల్టీమీడియా, యానిమేషన్ అండ్ స్పెషల్ ఎఫెక్ట్స్: 01 పోస్టు

డిజిటల్ ఫొటోగ్రాఫర్: 01 పోస్టు

మెకానిక్ మోటార్ వెహికల్: 01 పోస్టు

అర్హతలు

చదువు: కనీసం 55% మార్కులతో 10వ తరగతి (సైన్స్ సబ్జెక్టులతో) పాసై ఉండాలి.

టెక్నికల్ అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ (ITI) సర్టిఫికేట్ లేదా నేషనల్/స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ లేదా 2 ఏళ్ల అప్రెంటిస్ ట్రైనింగ్ అనుభవం ఉండాలి.

జీతం: నెలకు బేసిక్  ₹19,900 నుండి ₹63,200 . అలవెన్సులతో కలిపి ప్రారంభంలో నెలకు సుమారుగా ₹44,428 వరకు వస్తుంది.

వయస్సు: 30 జూన్ 2026 నాటికి 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం

అభ్యర్థులను మూడు దశల్లో ఎంపిక చేస్తారు:

స్క్రీనింగ్: దరఖాస్తుల పరిశీలన మరియు షార్ట్‌లిస్టింగ్.

ట్రేడ్ టెస్ట్: ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే.

రాత పరీక్ష : ట్రేడ్ టెస్ట్ పాసైన వారికి 150 మార్కులకు  రాత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ తీస్తారు.

ముఖ్యమైన తేదీలు & దరఖాస్తు విధానం

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

చివరి తేదీ: 30 జూన్ 2026 లోపు మీ దరఖాస్తు హార్డ్ కాపీ ల్యాబొరేటరీకి చేరుకోవాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్/OBC/EWS అభ్యర్థులకు ₹500 (డిమాండ్ డ్రాఫ్ట్ - DD రూపంలో). ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

అప్లికేషన్ పంపాల్సిన చిరునామా: Senior Controller of Administration, CSIR-National Physical Laboratory, Dr. K.S. Krishnan Marg, New Delhi – 110012.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement