Breaking News

తోటతరణికి ఫ్రాన్స్ ప్రభుత్వం 'షెవాలియర్' పురస్కారాన్ని ప్రకటించింది

ప్రముఖ కళా దర్శకుడు తోట తరణికి ఫ్రాన్స్ ప్రభుత్వంప్రతిష్టాత్మకమైన 'షెవాలియర్' (Chevalier de l'Ordre des Arts et des Lettres - Order of Arts and Letters) పురస్కారాన్ని ప్రకటించింది.


Published on: 12 Nov 2025 12:32  IST

ప్రముఖ కళా దర్శకుడు తోట తరణికి ఫ్రాన్స్ ప్రభుత్వంప్రతిష్టాత్మకమైన 'షెవాలియర్' (Chevalier de l'Ordre des Arts et des Lettres - Order of Arts and Letters) పురస్కారాన్ని ప్రకటించింది. భారతీయ సినిమాకు ఆయన చేసిన విశిష్ట సేవలకు గాను ఈ గౌరవం దక్కింది.ఈ అవార్డు ప్రదానోత్సవం నవంబర్ 13, 2025న చెన్నైలోని అలయన్స్ ఫ్రాన్సిస్ (Alliance Française) లో ఫ్రాన్స్ రాయబారి (Ambassador) చేతుల మీదుగా జరగనుంది. శివాజీ గణేశన్, కమల్ హాసన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ వంటి భారతీయ సినీ ప్రముఖుల జాబితాలో తోట తరణి కూడా ఇప్పుడు ఈ గౌరవాన్ని అందుకున్న వారిలో ఒకరు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సహా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలిపారు. 

Follow us on , &

ఇవీ చదవండి