Breaking News

అడ్వర్టైజింగ్ రంగ దిగ్గజం పీయూష్ పాండే కన్నుమూశారు.

అడ్వర్టైజింగ్ రంగ దిగ్గజం, పద్మశ్రీ అవార్డు గ్రహీత పీయూష్ పాండే (70) అనారోగ్యంతో బాధపడుతూ 2025 అక్టోబర్ 24న కన్నుమూశారు.


Published on: 24 Oct 2025 11:59  IST

అడ్వర్టైజింగ్ రంగ దిగ్గజం, పద్మశ్రీ అవార్డు గ్రహీత పీయూష్ పాండే (70) అనారోగ్యంతో బాధపడుతూ 2025 అక్టోబర్ 24న కన్నుమూశారు. ఫెవికాల్, వొడాఫోన్ పగ్ యాడ్స్, క్యాడ్‌బరీ డెయిరీమిల్క్ వంటి అనేక విజయవంతమైన, ప్రజల మదిలో నిలిచిపోయిన ప్రకటనలను సృష్టించిన ఘనత ఆయనది. 

ఆయన సుదీర్ఘకాలం పాటు ఓగిల్వీ ఇండియా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా పనిచేశారు.2019లో ఓగిల్వీ వరల్డ్‌వైడ్‌కి గ్లోబల్ చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్‌గా కూడా నియమితులయ్యారు.2016లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.2024లో ఎల్ఐఎ లెజెండ్ అవార్డును కూడా అందుకున్నారు.2014 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కోసం "అబ్ కీ బార్, మోదీ సర్కార్" అనే ప్రసిద్ధ నినాదాన్ని కూడా సృష్టించింది ఆయనే. ఆయన మరణం పట్ల కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఇతర ప్రముఖులు సంతాపం తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి