Breaking News

బంగారు, వెండి బల్లి విగ్రహాల తాపడాల వివాదం

కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలోని ప్రసిద్ధ బంగారు, వెండి బల్లి విగ్రహాల తాపడాలను పునరుద్ధరణ పనుల పేరుతో మార్చేశారనే ఆరోపణలు ఇటీవల వివాదాస్పదంగా మారాయి. దీనిపై భక్తుల నుంచి ఫిర్యాదులు రావడంతో అధికారులు విచారణ చేపట్టారు.


Published on: 07 Nov 2025 14:06  IST

కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలోని ప్రసిద్ధ బంగారు, వెండి బల్లి విగ్రహాల తాపడాలను పునరుద్ధరణ పనుల పేరుతో మార్చేశారనే ఆరోపణలు ఇటీవల వివాదాస్పదంగా మారాయి. దీనిపై భక్తుల నుంచి ఫిర్యాదులు రావడంతో అధికారులు విచారణ చేపట్టారు. ఆలయంలోని బంగారు, వెండి బల్లి విగ్రహాలను భక్తులు తాకితే వారి దోషాలు, పాపాలు తొలగిపోతాయని, దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం.పునరుద్ధరణ పనుల సమయంలో ఈ పురాతన, మహిమాన్వితమైన తాపడాలను తొలగించి, వాటి స్థానంలో కొత్తవాటిని అమర్చారని కొందరు భక్తులు, స్థానికులు ఆరోపిస్తున్నారు.ఇది ఆలయ సంప్రదాయాలకు విరుద్ధమని, అసలైన బల్లుల స్థానంలో నకిలీవి పెట్టారని ఆరోపణలు వస్తున్నాయి.ఈ ఫిర్యాదుల నేపథ్యంలో, పోలీసులు మరియు హిందూ ధార్మిక, ఎండోమెంట్స్ బోర్డు (HR&CE) అధికారులు విచారణ ప్రారంభించారు. సాధారణంగా బల్లి శరీరంపై పడితే అశుభంగా భావిస్తారు. అయితే, కంచిలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలోని బంగారు, వెండి బల్లి విగ్రహాలను తాకడం ద్వారా ఆ దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. గౌతమ మహర్షి శాపం కారణంగా బల్లులుగా మారిన శిష్యులకు ఈ ఆలయంలోని స్వామివారిని పూజించడం ద్వారా శాపవిమోచనం లభించిందని పురాణ గాథ. అందుకే భక్తులు ఇక్కడి బల్లులను తాకడానికి ఎంతో ప్రాధాన్యతనిస్తారు

Follow us on , &

ఇవీ చదవండి