Breaking News

హరియాణాలోని అంబాలా జిల్లాలో ఉదయం నిర్భయ్ (4) అనే నాలుగేళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ 220 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయాడు

హరియాణాలోని అంబాలా జిల్లాలో జూన్ 30, 2026 (మంగళవారం) ఉదయం నిర్భయ్ (4) అనే నాలుగేళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ 220 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయాడు. ప్రస్తుతం బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది భారీ యంత్రాలతో తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Published on: 30 Jun 2026 18:59  IST

హరియాణాలోని అంబాలా జిల్లాలో జూన్ 30, 2026 (మంగళవారం) ఉదయం నిర్భయ్ (4) అనే నాలుగేళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ 220 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయాడు. ప్రస్తుతం బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది భారీ యంత్రాలతో తీవ్రంగా శ్రమిస్తున్నారు.

అంబాలా జిల్లాలోని ధనౌరా (ధనియోరా) గ్రామం.జూన్ 30 ఉదయం 6:30 నుండి 7:00 గంటల మధ్యలో ఈ ప్రమాదం జరిగింది.బాలుడు తన తాతకు అల్పాహారం (భోజనం) అందించడానికి తండ్రి మంజీత్ సింగ్‌తో కలిసి పొలానికి వెళ్లాడు. తండ్రి, తాత పనుల్లో నిమగ్నమవ్వగా.. బాలుడు ఆడుకుంటూ పక్కనే తెరిచి ఉన్న 9 ఇంచుల వ్యాసం గల బోరుబావిలో పడిపోయాడు.

సహాయక చర్యల తాజా అప్‌డేట్

లోతు: బాలుడు దాదాపు 220 అడుగుల లోతులో చిక్కుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

రక్షణ చర్యలు: ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు పైపుల ద్వారా లోపలికి కెమెరాలను పంపి బాలుడి పరిస్థితిని గమనిస్తున్నాయి. అలాగే ఆక్సిజన్ సరఫరాను అందిస్తున్నారు.

ప్రత్యామ్నాయ ప్లాన్: బోరుబావికి సమాంతరంగా మరో పెద్దగుంతను తవ్వి టన్నెల్ ద్వారా బాలుడిని రక్షించడానికి ఆర్మీ భారీ యంత్రాలను మోహరించింది.

ప్రధాన సవాలు: బోరుబావిలో 60 అడుగుల లోతు తర్వాత నీరు ఉండటం రక్షణ సిబ్బందికి పెద్ద సవాలుగా మారింది.

అంబాలా డిప్యూటీ కమిషనర్ అజయ్ సింగ్ తోమర్ స్వయంగా ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. చిన్నారి క్షేమంగా బయటకు రావాలని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ప్రార్థనలు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి