Breaking News

సోమవారం లోక్‌సభలో రైల్వే డిమాండ్స్‌ ఫర్‌ గ్రాంట్స్‌పై జరిగిన చర్చలో ఆయన పాల్గొని మాట్లాడారు.

సోమవారం లోక్‌సభలో రైల్వే డిమాండ్స్‌ ఫర్‌ గ్రాంట్స్‌పై జరిగిన చర్చలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘రాష్ట్రానికి ఈ సారి రైల్వే బడ్జెట్‌లో రూ.9,417 కోట్లు కేంద్రం కేటాయించింది. ఈ కేటాయింపులు రాష్ట్ర పురోగతికి కేంద్ర నిబద్ధతను ప్రతిబింబిస్తాయి.


Published on: 18 Mar 2025 13:49  IST

లోక్‌సభలో జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌

న్యూఢిల్లీ, మార్చి 17: ‘అన్నవరం నుంచి బాపట్ల వరకు ప్రధాన తీరప్రాంత జిల్లాలు, ఓడ రేవులను కలుపుతూ కోస్తా రైల్వే కారిడార్‌ను తక్షణమే అభివృద్ధి చేయాలి’ అని జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ కోరారు. సోమవారం లోక్‌సభలో రైల్వే డిమాండ్స్‌ ఫర్‌ గ్రాంట్స్‌పై జరిగిన చర్చలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘రాష్ట్రానికి ఈ సారి రైల్వే బడ్జెట్‌లో రూ.9,417 కోట్లు కేంద్రం కేటాయించింది. ఈ కేటాయింపులు రాష్ట్ర పురోగతికి కేంద్ర నిబద్ధతను ప్రతిబింబిస్తాయి. కోస్తా కారిడార్‌ పూర్తి చేయడానికి 30కి.మీ. కొత్త రైల్వే ట్రాక్‌, గేట్‌ వే పోర్టు, కాకినాడ పోర్టుల మధ్య లింక్‌ అవసరమవుతుంది. రైల్వే మంత్రి వెంటనే ఈ కారిడార్‌ సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని చేపట్టాలి’ అని తంగెళ్ల విజ్ఞప్తి చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి