Breaking News

దమ్ముంటే.. ‘స్థానిక’ ఎన్నికలు జరపండి..


Published on: 14 May 2025 16:37  IST

ప్రభుత్వానికి దమ్ముంటే లోకల్‌ బాడీ ఎన్నికలు జరిపించాలని మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. బుధవారం జల్పల్లి మున్సిపాలిటీ పహాడిషరీఫ్‏లోని ప్రీమియర్‌ ఫంక్షన్‌ హాల్‌లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను 380 మందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి