Breaking News

బరిలో కల్నల్ సంతోష్ బాబు మాతృమూర్తి..


Published on: 31 Jan 2026 12:50  IST

కుమారుడిని దేశానికి అంకితం చేసిన మాతృమూర్తిగా సంతోష్ బాబు తల్లి మంజుల మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగింది. సూర్యాపేట మున్సిపాలిటీలో 44వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బికుమళ్ళ మంజుల ఉపేందర్ బిఆర్ఎస్ పార్టీ తరపున తన నామినేషన్‌ను అత్యంత ఉత్సాహంగా దాఖలు చేశారు. తన కుమారుడు దేశ ప్రజల రక్షణ కోసం సరిహద్దుల్లో పోరాడి ప్రాణత్యాగం చేయగా, తాను స్థానిక ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్నికల బరిలో నిలిచింది. మున్సిపల్ ఎన్నికల్లో ఈ వీరమాతకు పట్టం కట్టి.. గౌరవిస్తారో లేదో చూడాలి.

Follow us on , &

ఇవీ చదవండి