Breaking News

పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు పడేది అప్పుడే


Published on: 14 May 2025 18:55  IST

దేశంలో రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ స్కీం ద్వారా అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం రూ.6,000లను మూడు విడతలుగా అందిస్తారు. ఈ క్రమంలో ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి మధ్య ఈ నిధులను పంపిణీ చేస్తారు. ఇప్పటికే 19వ విడత మొత్తం రూ.2,000 ఫిబ్రవరిలో రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఇక, 20వ విడత సాయం కోసం రైతులు సిద్ధంగా ఉన్నారు. అయితే, ఈ విడత వాయిదా తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ 20వ విడత జూన్‌లో రావచ్చని తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి