Breaking News

పలువురు మున్సిపల్‌ కమిషనర్ల బదిలీ


Published on: 07 Feb 2026 13:40  IST

రాష్ట్రవ్యాప్తంగా పలువురు మున్సిపల్‌ కమిషనర్లను బదిలీ చేస్తూ మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అనంతపురం కమిషనర్‌గా ఎం.జస్వంత్‌రావును, అక్కడ పనిచేస్తున్న బి.బాలస్వామిని విజయనగరానికి, పల్నాడు యూడీఏలో కార్యదర్శిగా ఉన్న జి.సాంబశివరావును గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో డిప్యూటీ కమిషనర్‌గాను, అక్కడ పనిచేస్తున్న టి.వెంకటకృష్ణయ్యను పల్నాడు యూడీఏకు సెక్రటరీగా నియమించారు. 

Follow us on , &

ఇవీ చదవండి